Share News

AP free gas cylinders: సిలిండర్‌ బుక్‌ చేసినా సబ్సిడీ జమ కాలేదా

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:51 AM

దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సబ్సిడీ జమ కాలేదా? ఇకపై ఇంట్లో నుంచే డ్యాష్‌బోర్డు ద్వారా స్టేటస్‌ తెలుసుకోవచ్చు

 AP free gas cylinders: సిలిండర్‌ బుక్‌ చేసినా సబ్సిడీ జమ కాలేదా

ఉచిత గ్యాస్‌కు మీరు అర్హులేనా?

సమస్య ఎక్కడుందో ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు

త్వరలో అందుబాటులోకి దీపం-2 డ్యాష్‌బోర్డ్‌

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందేందుకు మీరు అర్హులేనా? అయినప్పటికీ ఈ పథకం కింద మీకు రావాల్సిన సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కాలేదా? సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు గ్యాస్‌ ఏజెన్సీలు, అధికారులను అడుగుతున్నా సమాధానం దొరకడం లేదా? అయితే ఇక నుంచి మీరు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఇంట్లో కూర్చునే మీ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండరు బుకింగ్‌ స్టేట్‌సతో సహా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని వినియోగదారులకు సౌలభ్యంగా ఉండేలా ‘దీపం-2 డ్యాష్‌బోర్డును సిద్ధం చేశారు. త్వరలోనే ఈ డ్యాష్‌బోర్డు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.


  • రెండో ఉచిత సిలిండరుకు బుకింగ్స్‌...

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌-6 హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది నవంబరు 1న దీపావళి కానుకగా ‘దీపం-2’ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం రూ. 2,684 కోట్ల నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలోనే ముందుగా సొమ్ము చెల్లించి గ్యాస్‌ సిలిండరు బుక్‌ చేసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు సిలిండర్లు డెలివరీ అవుతాయి. సిలిండరు డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోపు లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము మొత్తం వారి ఖాతాల్లో తిరిగి జమ అవుతుంది. మొత్తం మూడు సిలిండర్లూ ఒకసారే ఇవ్వకుండా ప్రతి నాలుగు నెలలకో సిలిండరు ఉచితంగా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. తొలి ఉచిత గ్యాస్‌ సిలిండరు బుక్‌ చేసుకోవడానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇవ్వగా 98 లక్షల మంది ఉపయోగించుకున్నారు. అయితే వీరిలో 14 వేల మందికి పైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇంతవరకు సబ్సిడీ సొమ్ము జమ కాలేదు. లబ్ధిదారుల గ్యాస్‌ కనెక్షన్‌తో బియ్యం కార్డు, ఆధార్‌ కార్డులు ఒకదానితో మరొకటి లింక్‌ కాకపోతే సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లో జమ కావడానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా మొదటి ఉచిత గ్యాస్‌ సిలిండరు బుకింగ్‌కు గత మార్చి 31తో గడువు ముగిసినందున ఈ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి రెండో ఉచిత సిలిండరుకు బుకింగ్స్‌ ప్రారంభించారు.


డ్యాష్‌బోర్డులో స్టేటస్‌

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్స్‌కు సంబంధించిన స్టేట స్‌ను తెలిపే డ్యాష్‌బోర్డును పౌరసరఫరాలశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో ్ఛఞఛీట2.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లోకి వెళితే ‘దీపం-2 డ్యాష్‌బోర్డ్‌’ ఓపెన్‌ అవుతుంది. దానిలో 4 రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదట కనిపించే జుుఽౌఠీ డౌఠట ఛ్ఛ్ఛీఞ్చఝ2 ట్ట్చ్టఠట అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ఒక సెర్చ్‌ బాక్స్‌ వస్తుంది. ఆ బాక్స్‌లో లబ్ధిదారులు తమ బియ్యం కార్డు నంబరు లేదా ఎల్పీజీ కన్స్యూమర్‌ నంబరు ను ఎంటర్‌ చేయాలి. అప్పుడు లబ్ధిదారుల ఎల్పీజీ ఐడీతో లింక్‌ అయు ఉన్న మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేస్తే.. దీపం-2 పథకం లబ్ధిదారుల ఎలిజిబులిటీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. పర్సనల్‌ డిటెయిల్స్‌లో.. వరుసగా ఎల్పీజీ కన్స్యూమర్‌ పేరు, మొబైల్‌ నంబ రు, జిల్లా, మండలం, బియ్యం కార్డు నంబరు, ఎల్పీజీ కన్స్యూమర్‌ ఐడీ నంబర్లు ఉంటాయి. ఎల్పీజీ ఏజెన్సీ డిటెయిల్స్‌లో ఆ ఏజెన్సీ పేరు, ఐడీ, ఓఎంసీ(ఆయిల్‌ కంపెనీ) పేరు ఉంటాయి. ఇక ట్రాన్సాక్షన్‌ స్టేట్‌సలో వరుస నెంబరు, గ్యాస్‌ సిలిండరు డెలివరీ డేట్‌, సబ్సిడీ జమ తేదీ ఉంటాయి.

Updated Date - Apr 12 , 2025 | 04:51 AM