Share News

CPI Narayana: సీఎంలు మారినా అవినీతి అలాగే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:29 AM

రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా అవినీతి మాత్రం మారలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.

 CPI Narayana: సీఎంలు మారినా అవినీతి అలాగే..

  • సీపీఐ నారాయణ

తిరుపతి(ఆటోనగర్‌), జూలై 6: రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా అవినీతి మాత్రం మారలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో అవినీతి పెరగబట్టే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక అధికారులు, ఉద్యోగులు బదిలీల్లో అవినీతి చోటు చేసుకోవడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్లకు స్మార్టు మీటర్లు అమర్చితే పగలకొట్టండని ప్రస్తుత మంత్రి లోకేశ్‌ పిలుపునిచ్చారని.. ఆ ప్రకారం సీపీఐ నాయకులు, కార్యకర్తలు స్మార్ట్‌ మీటర్లను పగలకొడతారని నారాయణ చెప్పారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బనకచర్ల, పోలవరం, నగరి-గాలేరు, హంద్రీ-నీవా ప్రాజెక్టులనూ పూర్తి చేసి ప్రజలకు నీరందించాలని ఆయన డిమాండు చేశారు. మామిడి రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు.

Updated Date - Jul 07 , 2025 | 03:31 AM