CM Chandrababu Reviews: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:03 PM
అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి విద్యార్థి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి హాస్టల్లో వాటర్ శాంపిల్స్ తీసుకోవాలని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలని కూడా అధికారులను ఆదేశించారు.
కాగా, ఏపీ వ్యాప్తంగా ఉన్న 311 సంక్షేమ వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందుకోసం 6.22 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 49 గురుకుల హాస్టల్స్, రెండు స్టడీ సర్కిళ్లలోనూ ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయటం కోసం రూ.3.06 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను ఉపయోగించి 45 రోజుల్లో ఆయా చోట్ల ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
గురు తేగ్ బహదూర్ త్యాగం నిరుపమానం.. షహీదీ దివస్‌లో మోదీ
సినిమా షూటింగుల నుంచి బర్త్ డే పార్టీల వరకు.. నమో భారత్ రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు..