CM Chandrababu: కానిస్టేబుల్ టు ఐపీఎస్.. ఉదయ కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:57 PM
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఉల్లపాలెంకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బామ్మ రమణమ్మే అతడ్ని సాకింది.

కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 350 ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఉదయ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఉదయ కృష్ణారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌గా ఎదిగిన ఉదయ కృష్ణారెడ్డి ప్రయాణం.. ధైర్యం, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. సాధించాలనే పట్టుదల ప్రతీ అడ్డంకిని బద్దలు కొడుతుంది. కొత్త చరిత్రను రాస్తుంది. భవిష్యత్తు పట్టు వదలకుండా పని చేసే వారిదే ’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..