Cyclone Montha: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. ప్రోటోకాల్ పక్కన పెట్టి..
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:36 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల కోసం ప్రోటోకాల్‌ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్‌లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల కోసం ప్రోటోకాల్‌ను పక్కనపెట్టారు. సీఎం కాన్వాయ్ వెహికల్‌లో కాకుండా ఇన్నోవా కారులోనే బాధితుల వద్దకు వెళ్లారు.
ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణించాల్సి ఉన్నా సాధారణ వాహనంలోనే బాధితుల దగ్గరకు వెళ్లారు. అల్లవరం మండలంలోని ఓడరేవుల సమీపంలో ఉన్న పునరావాస శిబిరాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. పునరావాస బాధితులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు.
దాదాపు అరగంట సేపు పునరావాస శిబిరంలోనే గడిపారు. పునరావాస శిబిరంలో వసతుల కల్పనపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. అరగట్ల పాలెం, బెండమూరు లంక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులను కలిసి మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, గుర్రపు డెక్క సమస్య ఉందని, వాటిని క్లియర్ చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. రైతులు చెప్పిన విధంగా డ్రైన్లను క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
గ్రామ సర్పంచ్ మొండితనం.. నడి రోడ్డులో చేతి పంపు..
సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ