CM Chandrababu: వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించింది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 10 , 2025 | 09:00 PM
ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందేమాతరమని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందు తీసుకెళ్తున్నారని అన్నారు.
అమరావతి, నవంబర్ 10: ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందేమాతర గేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నాయుడు అన్నారు. భారత జాతీయ గేయమైన వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం మాట్లాడారు. వందేమాతర నినాదం ఒక శక్తి, పోరాటం, తలవంచని పౌరుషం, తిరుగులేని దేశభక్తి, స్వతంత్ర ఉద్యమాన్ని ములువు తిప్పిన గేయమని కొనియాడారు. కులాలకు మతాలకు అతీతంగా వందేమాతర గేయం ఉంటుందని చెప్పారు. ఏడాది పాటు వందేమాతర ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ప్రధాని పిలుపులో భాగంగా నాలుగు దశలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి భారతీయుడు అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సిన గేయం వందేమాతరం అని సీఎం పిలుపునిచ్చారు. వందేమాతరం అందరిలో దేశభక్తిని రగిలించిందని చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ప్రధానమంత్రి ముందు తీసుకెళ్తున్నారని అన్నారు. చాలా దేశాల్లో సమర్థవంతమైన నాయకులు లేరని.. 2047వ సంవత్సరానికి భారతదేశంలో అన్నీ నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా తయారవుతుందన్నారు. 78 సంవత్సరాల్లో భారతదేశ శక్తి ఏమిటో ప్రపంచానికి చెప్పామన్నారు. అన్ని రంగాల్లో భారతదేశం ముందే ఉంటుందని కొనియాడారు. ఒకప్పుడు వందేమాతరం గేయం భారతదేశానికి స్వతంత్రం రావటానికి స్ఫూర్తినిచ్చిందని.. భారతదేశం నెంబర్ వన్ దేశంగా నిలబడటానికి వందేమాతరం ఒక టానిక్‌గా పనిచేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌గా ఏపీ.. బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం
‘నాకేం సంబంధం’.. జగన్‌పై అయ్యన్న సెటైర్లు..