CM Chandrababu Naidu: మంత్రి లోకేష్‌ను కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN , Publish Date - Jun 29 , 2025 | 10:02 PM
CM Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారని, మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచి నియోజకవర్గంగా మార్చుతారని అన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై దిశానిర్దేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. చెడు నాయకులకు మంచి నియోజకవర్గం ఇస్తే చెడగొడతారని, మంచి నాయకులకు చెడు నియోజకవర్గం ఇచ్చినా మంచి నియోజకవర్గంగా మార్చుతారని అన్నారు. ఇందుకు మంత్రి నారా లోకేష్‌ను ఉదాహరణగా చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని సూచించాను. లేదు మంగళగిరిలో ఎప్పుడూ గెలవలేదు, అక్కడి నుంచే పోటీ చేస్తానని లోకేష్ చెప్పారు. నెల ముందు నియోజకవర్గానికి వెళ్లారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ముందే వచ్చి ఉంటే గెలిచేవారు. అయినా నియోజకవర్గంలో ఐదేళ్లు కష్టపడి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించారు. మొదటిసారి గెలిచిన వాళ్లు కూడా ఈ విధంగానే పని చేయాలి. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది యువకులు ఉన్నారు.
నేను 9వ సారి ఎమ్మెల్యే అయ్యాను. మొదటి సారి గెలిచిన వాళ్లు వచ్చి ఏం చేయాలో నాకు చెప్తున్నారు. మీరు అలా చేయండి, ఇలా చేయండని అంటున్నారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలని యువతకు అవకాశం ఇచ్చాను. దేశంలో యంగెస్ట్ అసెంబ్లీ టీడీపీ.. యంగెస్ట్ పార్లమెంట్ పార్టీ టీడీపీ. ఇటీవల అమిత్ షా కూడా అదే మాట అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పాపులర్ అవుతున్నారు.. మరికొంత మంది పేరు తెచ్చుకోలేకపోతున్నారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత నిర్లక్ష్యమా.. నేలపై పడుకోబెట్టి ఎక్స్‌రే తీస్తారా?..
విలన్ గొప్ప మనసు.. సొంత ఖర్చులతో 101 మందికి కాశీ యాత్ర..