ఉద్యోగుల సమస్యలపై ‘5న టీ తాగుతూ మాట్లాడుకుందాం’
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:19 AM
ఉద్యోగుల సమస్యలపై ఈనెల 5వ తేదీన ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడి వెల్లడి
చిత్తూరు అర్బన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ఈనెల 5వ తేదీన ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య వెల్లడించారు. గురువారం స్థానిక సంఘ కార్యాలయంలో జిల్లా ఉద్యోగ సంఘ నేతలు, తాలూకా ఆఫీస్ బేరర్లకు జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉద్యోగులకు రూ.25వేల కోట్ల వరకు రావాల్సి ఉందని, దాదాపు 12 రకాల సమస్యలను మూడు నెలలపాటు ఈ కార్యక్రమం ద్వారా చర్చించాలన్నారు. అనంతరం రాష్ట్ర సంఘానికి నివేదించి తదుపరి కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు నరే్‌షబాబు, కోశాధికారి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.