Smoke In Jayanti Express: కన్యాకుమారి-పూణె జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 10:16 AM
కన్యాకుమారి-పూణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో అకస్మాత్తుగా పొగలు రేగడం చూసి ప్రయాణికులు హడలిపోయారు. నందలూరు వద్ద రైలును ఆపిన సిబ్బంది తనిఖీలు నిర్వహించగా సాంకేతిక లోపం బయటపడింది. రిపేర్ల అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.

ఇంటర్నెట్ డెస్క్: కన్యాకుమారి, పూణెల మధ్య నడిచే జయంతి ఎక్స్‌ప్రెస్‌లో సడెన్‌గా పొగలు రావడం కలకలానికి దారితీసింది. పొగలు కమ్ముకోవడం చూసి ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏసీ బోగీ కింద భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై గార్డుకు సమాచారం అందించారు. దీంతో, సిబ్బంది రైలును నందలూరు వద్ద నిలిపివేశారు. అనంతరం బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైలు బ్రేకుల వద్ద నుంచి పొగలు వచ్చినట్టు గుర్తించారు. మరమ్మతుల తరువాత రైలు గమ్యస్థానానికి బయలుదేరింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి