Share News

రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్ర్భాంతి

ABN , Publish Date - Apr 29 , 2025 | 02:54 AM

పాకాల మండలం తోటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్ర్భాంతి

తిరుపతి (కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి: పాకాల మండలం తోటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కూడా రోడ్డుప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికిమెరుగైన వైద్యసేవలు అందించాలని రుయాస్పత్రి సిబ్బందికి సూచించారు.

ఐదుగురి మృతిపై డిప్యూటీ సీఎం ఆవేదన

పాకాల, ఆంధ్రజ్యోతి: పాకాల మండలం తోటపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందడంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. తిరుమల దర్శనం చేసుకొని తిరుగు పయనమైన భక్తులు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 02:54 AM