Chevireddy Emotional: ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..
ABN , Publish Date - Jul 22 , 2025 | 02:27 PM
లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏసీబీ కోర్టులో ఎమోషనల్ అయ్యారు. తండ్రి, తమ్ముడు చనిపోవడంతోనే..

విజయవాడ: ఏసీబీ కోర్టులో తన వాదనలు వినిపించుకునే క్రమంలో తుడా మాజీ చైర్మన్, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని న్యాయాధికారికి చెప్పిన చెవిరెడ్డి.. తనను మద్యం వ్యాపారం చేయవద్దని తండ్రి చెప్పినట్టు వెల్లడించారు. తండ్రి, తమ్ముడు చనిపోవడంతోనే తాను లిక్కర్ జోలికి వెళ్లలేదని, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నందుకు బాధగా ఉందని కోర్టులో ఎమోషనల్ అయ్యారు.
కాగా, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఒకవైపు లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరోవైపు తుడా ఉచ్చు బిగుసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.380 కోట్ల పైచిలుకు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు విజిలెన్సు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి దాదాపు 4300 పేజీల నివేదికను అందించారు. దీంతో ప్రతి పైసాకు చెవిరెడ్డి, అప్పటి తుడా అధికారులు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఎక్కువ శాతం నిధులు చెవిరెడ్డి తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆధారాలు గుర్తించారు. దాదాపు 90 శాతం నిధులను చంద్రగిరి నియోజకవర్గంలోని పనులకు మళ్లించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
సైట్ క్లియరెన్స్ కోసం ఏపీ దరఖాస్తు
ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల
For Telugu and Latest News