Saudi Arabia Accident: సౌదీలో రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:43 PM
సౌదీ అరేబియాలోని మదీనాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదకర సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్..
ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ ప్రమాదంపై తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఈ నెల 9వ తేదీన 54 మంది ఇండియానుంచి మక్కా యాత్రకోసం వెళ్లారు. సోమవారం మక్కాలో ప్రార్థనలు ముగిసిన తర్వాత 46 మంది బస్‌లో మదీనా బయలు దేరారు. బదర్ - మదీనా మధ్య ముఫరహత్ దగ్గర బస్సు - ట్యాంకర్ ఢీకొట్టుకున్నాయి. ప్రమాదం కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి
46 మందిలో ఒక్కడే బతికాడు.. సౌదీ బస్ ప్రమాదంలో తప్పించుకున్న వ్యక్తి ఎవరంటే..
మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి