Share News

Jogi Ramesh: చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీనీ ముట్టడిస్తా: జోగి రమేశ్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:18 AM

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీని కూడా ముట్టడిస్తా’ అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Jogi Ramesh: చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీనీ ముట్టడిస్తా: జోగి రమేశ్‌

ఇబ్రహీంపట్నం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటినే కాదు.. అసెంబ్లీని కూడా ముట్టడిస్తా’ అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ప్రజల పక్షాన పోరాడతాం. సూపర్‌ సిక్స్‌ సంగతేంటని అడుగుతాం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కొండపల్లి మున్సిపాలిటీలో గెలిచింది. సీల్డ్‌ కవర్‌లో ఏముందో వారం నుంచి ఎందుకు తెరవలేదు? ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూలత ఉందో, వ్యతిరేకత ఉందో కొండపల్లి మున్సిపాలిటీ నుంచే తెలుస్తుంది. మరోసారి ప్రజలు మీకు ఇక్కడ ఓట్లు వేస్తారో లేదో ఎన్నికలు పెడితే తెలుస్తుంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఓ బుడంకాయ్‌. నందిగామలో ఎందుకు ఓడిపోయావో చెప్పు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీ, జగన్మోహన్‌రెడ్డి కాదా?’ అని ప్రశ్నించారు.

Updated Date - Jun 17 , 2025 | 05:20 AM