Share News

కొల్లేరుపై సమగ్ర సమాచారమివ్వండి

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:15 AM

కొల్లేరుపై సమగ్ర సమాచారాన్ని మాకు అందించండి. కొల్లేరు అభయారణ్యం పరిధిలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ఏలూరు పారిశుధ్య వ్యర్థాలు, శుద్ధీకరణ సామర్థ్యం..

కొల్లేరుపై సమగ్ర సమాచారమివ్వండి

  • అధికారులకు సాధికార కమిటీ ఆదేశం

  • ముగిసిన రెండ్రోజుల పర్యటన

ఏలూరు, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘కొల్లేరుపై సమగ్ర సమాచారాన్ని మాకు అందించండి. కొల్లేరు అభయారణ్యం పరిధిలో రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ఏలూరు పారిశుధ్య వ్యర్థాలు, శుద్ధీకరణ సామర్థ్యం, సరస్సు పరిధిలో చేపల పెంపకానికి వినియోగించే రసాయన ఎరువులు, పురుగు మందుల వివరాలు మాకివ్వండి. ఏ ఒక్క అంశాన్ని వదలకండి. మేము కోరిన సమాచారం త్వరితగతిన అందేలా చూడండి’ అని జిల్లా యంత్రాంగానికి కేంద్ర సాఽధికార కమిటీ ఈ ఆదేశాలిచ్చింది.


కొల్లేరు కాలుష్యం, ఇతర అంశాలపై కూడా క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా మత్స్యశాఖ అధికారులను ఆదేశించింది. కొల్లేరులో వాస్తవ పరిస్థితులను పరిశీలించి మూడు నెలల్లోపు సమగ్ర నివేదిక సమర్పించేందుకు వీలుగా కేంద్ర సాధికార కమిటీ ఏలూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటన బుధవారంతో ముగిసింది.

Updated Date - Jun 19 , 2025 | 07:15 AM