Share News

Quantum Computing Course: ఏయూలో క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:07 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు నిర్వహణకు సెనేట్‌ ఆమోదం తెలిపింది..

Quantum Computing Course: ఏయూలో క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు
Quantum Computing Course

  • ఈఏపీసెట్‌ ద్వారా ప్రవేశాలు

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ క్వాంటం కంప్యూటింగ్‌ కోర్సు నిర్వహణకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం జరిగిన సెనేట్‌ సమావేశంలో నూతన కోర్సు ప్రారంభానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశాలను ఈఏపీసెట్‌ ద్వారా కల్పించనున్నారు. తొలిబ్యాచ్‌లో 30 మందికి అడ్మిషన్స్‌ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటుచేయాలని భావిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సును ఏయూలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 06:07 AM