Share News

ఆకాంక్షిత జిల్లాల జాబితాలోకి అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశంలనూ చేర్చాలి: లంకా

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:32 AM

రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను కూడా ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ తెలిపారు.

ఆకాంక్షిత జిల్లాల జాబితాలోకి అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశంలనూ  చేర్చాలి: లంకా

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను కూడా ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వికసిత భారత్‌, స్వర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా రాష్ట్రంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో అభివృద్ధిని వేగవంతం చేయాల్సి అవసరం ఉంది. దేశంలో 117 ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులు ఉంటే... రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కడప జిల్లాలతోపాటు, 15 బ్లాకులు ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులుగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉన్న సంక్షిష్ట పరిస్థితులే సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కూడా కనిపిస్తుంటాయి. అందుకనే వాటిని కూడా ఈ జాబితాలో చేర్చే అంశాన్ని సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించేలా ప్రయత్నిసా’ అని దినకర్‌ అన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 05:35 AM