Share News

NALCO: నాల్కో నుంచి విద్యుత్‌ కొనుగోలు

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:45 AM

నేషనల్‌ అల్యూమినియం కంపెనీ నాల్కో తో ఏపీఎస్పీడీసీఎల్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది.

NALCO: నాల్కో నుంచి విద్యుత్‌ కొనుగోలు

  • ఏపీఎస్పీడీసీఎల్‌ ఒప్పందం

  • యూనిట్‌ 2.49 చొప్పున పవన విద్యుత్‌: ఏపీఈఆర్‌సీ ఆమోదం

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో)తో ఏపీఎస్పీడీసీఎల్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంది. యూనిట్‌కు రూ. 2.49 చొప్పున 50.4 మెగావాట్ల పవన విద్యుత్తు కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు నాల్కోతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి 2041 ఏప్రిల్‌ ఒకటో తేదీ దాకా కొనసాగుతుంది. అయితే.. ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ‘మస్ట్‌ రన్‌’ పరిధిలోకి రాదని పేర్కొంది.. ఎస్పీడీసీఎల్‌ ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు కరెంటు కొనుగోలు చేయవచ్చన్న షరతుకు నాల్కో ఆమోదించింది.

Updated Date - Jul 11 , 2025 | 03:45 AM