AP Liquor Scam: లిక్కర్ స్కాంలో అనిల్ చోఖ్రా అరెస్ట్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
ABN , Publish Date - Nov 15 , 2025 | 03:28 PM
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీల ఏర్పాటు, మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
విజయవాడ, నవంబర్ 15: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న అనిల్ చోఖ్రా రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు పొందుపర్చారు. అనిల్ చోఖ్రా.. లిక్కర్ స్కాం కేసులో ఎ1 రాజ్ కేసిరెడ్డి, ఎ7 ముప్పిడి అవినాష్ రెడ్డితో చేతులు కలిపి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు.
అదానీ, లీలా, స్పై ఆగ్రో డిస్టలరీస్‌కు అనిల్ చోఖ్రా షెల్ కంపెనీల డబ్బు మళ్లించారని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 25 షెల్ కంపెనీలును అనిల్ చోఖ్రా స్థాపించి, లిక్కర్ సొమ్ము బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు. కాగా, అనిల్ చోఖ్రా మనీ ల్యాండరింగ్ కేసుల్లో ఇప్పటికే రెండు సార్లు అరెస్టు కాగా, ముంబైలో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసులో నిందితుడుగా కూడా ఉన్నాడు.
అంతేకాదు, షెల్ కంపెనీల కోసం వందల కొద్ది బ్యాంకు ఖాతాలు, 11 ఫోన్ నెంబర్‌లు అనిల్ చోఖ్రా ఉపయోగించాడు. నకిలీ వే బిల్లులు సృష్టించడం, ఫేక్ జీయస్టీ బిల్లులు, షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి కమీషన్లు వసూలు చేశాడు. లిక్కర్ స్కాం కేసులో బ్యాంకు ఖాతాలను సృష్టించి, డబ్బులు రూటింగ్ చేయడంలో అనిల్ చోఖ్రా కీలక పాత్ర పోషించాడు. రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా లిక్కర్ డబ్బును అనిల్ చోఖ్రా కిక్ బ్యాగ్స్ ద్వారా తరలించాడు అని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.
తాజాగా ఈ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఎసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో షెల్ కంపెనీల ఏర్పాటు, మణి లాండరింగ్‌లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అనిల్ చోఖ్రాకు కోర్టు రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?
టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి