AP Corporations: ఏపీలో 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:33 PM
రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, నవంబర్ 22: రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివశ్రీనివాసరావు (నరసరావుపేట)
ఏపీ స్టేట్ అడైయిజరీ ఆన్ చైల్డ్ లేబర్ చైర్మన్ గా వేటుకూరి ఏవిఎస్ సత్యనారాయణ రాజు
ఏపీ అఫిషియల్ ల్యాంగ్వేజెస్ కమిషన్ చైర్మన్ గా విక్రమ్
ఉర్దూ అకాడమీ చైర్మన్ గా మౌలానా షిబిలి (విజయవాడ)
ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటి ఫెడ్ రేషన్ చైర్మన్ గా యాతగిరి రాంప్రసాద్ (కడప)
పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటి చైర్మన్ గా చిరుమామిళ్ల మదుబాబు (మాచర్ల)
ఏపీ స్టేట్ రెడ్డిక వెల్పేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా కొండా శంకర్ రెడ్డి (ఇచ్చాపురం)
ఏపీ కుర్ని, కరికాల భక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మిన్నప్ప (యమ్మిగనూరు)
ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ముక్తియార్ (పొద్దుటూరు)
ఏపీ బట్రాజు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా సరికొండ వెంకటేశ్వరరాజు (సత్తెనపల్లి)
ఏపీ స్టేట్ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా వనపర్తి వీరభద్రరావు (పత్తిపాడు) నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..
వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి