Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:59 PM
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులు, ఇంకా..

ఢిల్లీ, జులై 15: 'లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ' అంశంపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రసంగించారు. అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు అన్నారు. 'దేశంలో లైసెన్స్ రాజ్ విధానానికి స్వస్తి చెప్పారు.
పెట్టుబడిదారులు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేశారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చింది. పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు.. 2014లో మోదీ కూడా అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. 'మోదీ హయాంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.. అనేక దేశాలతో మోదీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్' పేరుతో ముందుకెళ్తున్నాం.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచాం. యువత ఆశలు, ఆకాంక్షల సాధనకు మోదీ కృషి చేస్తున్నారు. వికసిత్ భారత్ పిలుపుతో దేశ రూపురేఖలు మారుతున్నాయి. ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు మనం పరిష్కారం చూపిస్తున్నాం.. మోదీ సంస్కరణల వల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అని చంద్రబాబు చెప్పారు.
ఈ ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్‌తో పాటు.. ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. వీటితోపాటు, ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు.
Also Read:
Youth Fight: అర్ధరాత్రి రోడ్డుపై యువతీయువకుల హల్‌చల్..
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
For More Telangana News and Telugu News..