Cyclone News: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. బలహీనపడిన ‘దిత్వా’ తుఫాను
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:46 PM
ఏపీ ప్రజల్ని వణికించిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా మరింత బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో 5 కిమీ వేగంతో మాత్రమే కదిలింది. రేపు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో..
అమరావతి, నవంబర్ 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాను ‘దిత్వా’ ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడింది. రేపు (డిసెంబర్ 1) ఉదయానికి సాధారణ వాయుగుండంగా మారి పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
గడిచిన 6 గంటల్లో తుఫాను గంటకు కేవలం 5 కి.మీ. వేగంతోనే కదలడంతో దాని తీవ్రత గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ రేపు దక్షిణ కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను స్టాండ్‌బైలో ఉంచారు.
రేపటి వర్ష సూచన :
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు
బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇవి కూడా చదవండి
సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి