Share News

AP flood relief: ఏపీలో మొంథా తుఫాను విలయం.. ప్రాణాలు కాపాడుతున్న డ్రోన్లు..

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:58 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకున్నారు. వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.

AP flood relief: ఏపీలో మొంథా తుఫాను విలయం.. ప్రాణాలు కాపాడుతున్న డ్రోన్లు..
drones in disaster management

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకున్నారు. వారి కోసం ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు మొంథా తుఫాను సహయక చర్యల్లో భాగంగా పరిస్థితి అంచనా వేసేందుకు ప్రభుత్వం డ్రోన్లను కూడా వినియోగిస్తోంది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది (AP government innovation).


బాపట్ల జిల్లా పర్చూరు వాగులో కొట్టుకుపోతోన్న వ్యక్తిని అధికారులు డ్రోన్ ద్వారా గుర్తించారు. అధికారులు వెంటనే అలెర్ట్ కావడంతో వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. అంతేకాదు వరదలో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల కొట్టుకుపోతున్న పశువులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఒడ్డుకు చేర్చారు. డ్రోన్ల ద్వారా ప్రమాదకర పరిస్థితులను గుర్తించి అధికారులు వెంటనే అలెర్ట్ అవుతున్నారు (flood rescue technology).


ఏపీ ప్రభుత్వం డ్రోన్లను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఇటీవల ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు (AP drone operations). డ్రోన్ మార్ట్ ద్వారా వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేందుకు పోర్టల్‌ను ఏపీ డ్రోన్ కార్పోరేషన్ రూపొందించింది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ద్వారా వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు. డ్రోన్ మార్ట్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత విపత్తు సమయంలోనూ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్

మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 08:24 PM