WOMEN WITH PETROL BOTTLE : పెట్రోల్ బాటిల్‌తో కలెక్టరేట్‌లో మహిళ హల్‌చల్
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:54 PM
తన సొంత స్థలాన్ని బంధువులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రామగిరి మండలంలోని దొంతిమర్రి గ్రామానికి చెందిన పోలేరమ్మ గురువారం కలెక్టరేట్‌కు పెట్రోల్ బాటిల్‌తో వచ్చి హల్‌చల్ చేశారు.

పుట్టపర్తి టౌన, ఏప్రిల్17 (ఆంధ్రజ్యోతి): తన సొంత స్థలాన్ని బంధువులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రామగిరి మండలంలోని దొంతిమర్రి గ్రామానికి చెందిన పోలేరమ్మ గురువారం కలెక్టరేట్‌కు పెట్రోల్ బాటిల్‌తో వచ్చి హల్‌చల్ చేశారు. ఆత్మహత్య చేసుకుంటున్నాని గట్టిగా కేకలు వేయడంతో, గమనించిన పోలీసులు ఆమె వద్ద నుంచి పెట్రోల్ బాటిల్‌ను లాకున్నారు. సమస్యను అధికారులకు చెప్పాలని పంపారు. పోలేరమ్మ మాట్లాడుతూ.. సొంత స్థలంలో బంధువులు అక్రమంగా ప్రహరీ నిర్మించారని, దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక పెట్రోల్ బాటిల్‌తో కలెక్టరేట్ వద్దకు వచ్చినట్లు పేర్కొన్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు.