Share News

MLAటీడీపీని బలోపేతం చేయండి : ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:10 PM

ఎన్పీకుంట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కోరారు.

MLAటీడీపీని బలోపేతం చేయండి : ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

కదిరి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): ఎన్పీకుంట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కోరారు. సోమవారం పట్టణంలోని తాయిగ్రాండ్‌లో ఏర్పాటు చేసిన ఎన్పీకుంట మండల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, అయితే ఆ అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారని అన్నారు. ప్రతినెలా మండలంలో సమావేశం నిర్వహించి, చేసిన అభివృద్ధిని.. లోటుపాట్లును చర్చించాలన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ రాష్ట్ర నాయకురాలు ఫర్వీనాభాను, కన్వీనర్‌ చంద్రశేఖర్‌నాయుడు, ఆంజనప్పనాయుడు, దండే రవి, శ్రీరాములు, పౌల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:10 PM