Share News

laws చట్టాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:22 AM

స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో ఆర్సీపీ ఆధ్వర్యంలో న్యాయసేవా సదస్సును ఆదివారం నిర్వహించారు.

laws చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది నరసింహులు

నల్లమాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో ఆర్సీపీ ఆధ్వర్యంలో న్యాయసేవా సదస్సును ఆదివారం నిర్వహించారు. ఇందులో హైకోర్టు న్యాయవాది పి.నరసింహులు మాట్లాడుతూ.. సమాజంలో చాలా మందికి చట్టాలు, హక్కులపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు. సెల్‌ఫోన్ల అతి వినియోగం వల్ల నేటి యువత చెడిపోతోందని, వారిపై తల్లిదండ్రులు నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, సీనియర్‌ జర్నలిస్టు చందనబాబు, ఆర్సీపీ మల్లె గంగాధర్‌, ఏటీఎల్‌ వన్నూర్‌స్వామి, ఓడీసీ ఆర్సీపీ మున్నా, బుట్టి నాగభూషణ నాయుడు, రైతు సంఘం నాయకులు చంద్రమోహనరెడ్డి, రామచంద్ర, గంగన్న, వెంకటయ్య, లక్ష్మీనరసమ్మ, మాజీ సర్పంచ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:22 AM