Share News

medical camp సత్యసాయి వైద్య శిబిరానికి భారీ స్పందన

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:21 AM

సత్యసాయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు మండలంలోని పాముదుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి అనూహ్య సంద్పన లభించింది

medical camp సత్యసాయి వైద్య శిబిరానికి భారీ స్పందన
పాముదుర్తిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న సత్యసాయి వైద్యులు

బుక్కపట్నం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): సత్యసాయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు మండలంలోని పాముదుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి అనూహ్య సంద్పన లభించింది. ఈ వైద్యశిబిరంలో దాదాపు 173 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి, దంతాలు, గైనిక్‌, జనరల్‌ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 20 మందికి మెరుగైన చికిత్స నిమ్తితం పుట్టపర్తి, బెంగుళూరులోని సత్యసాయి ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుమ, ప్రశాంత, నిఖిల్‌, క్రిష్ణాంజి, సీమా, యూకే వైద్యులు, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి, మెడికల్‌ ఇనచార్జీ రావు, సర్పంచ జ్యోతి క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:21 AM