Share News

SISA: నీటి కేటాయింపులతోనే సీమ అభివృద్ధి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:49 PM

సాగుకు అవసరమైన నీటి కేటాయింపులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన(ఎ్‌సఐఎ్‌సఏ) ఆధ్వర్యంలో సోమవారం ఓ సదస్సును నిర్వహించారు.

SISA: నీటి కేటాయింపులతోనే సీమ అభివృద్ధి
Speakers expressing solidarity

అనంతపురం సెంట్రల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): సాగుకు అవసరమైన నీటి కేటాయింపులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన(ఎ్‌సఐఎ్‌సఏ) ఆధ్వర్యంలో సోమవారం ఓ సదస్సును నిర్వహించారు. ‘రాయలసీమ కరువు, నీటి సవాళ్లు, పరిష్కారాల సాధ్య, సాధ్యాలు’ అంశంపై ఎస్కేయూలో ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. వక్తలుగా జలసాధన సమితి నాయ కులు, న్యాయవాది రామకుమార్‌, ప్రొఫెసర్‌ జీవీ రమణ, సాకేహరి, నాగార్జునరెడ్డి, అశోక్‌ వర్ధన, రామాంజినేయులు, రాహుల్‌ హాజరై మాట్లాడారు. మూడు దశాబ్దాల కిందటి వరకు వాగులు, వంకల ద్వారా పారే వర్షపు నీరు, చెరువులు, కుంటల్లోని నిల్వ నీటి ద్వారా వరి, రాగి వంటి పంటలు పండించేవారన్నారు. వర్షాకాలంలో వేరుశనగ, పప్పుశనగ, కందులు, పెసలు, అలసంద, నువ్వులు వంటివి సాగు చేస్తూ వచ్చారన్నారు. ఈ క్రమంలో సాగు విస్తీర్ణం పెరిగి కొంతమేరకు ఆహార కొరత తీరిందని వివరించారు. అనంతరం వర్షాభావం నేపథ్యంలో బోరు బావులను తవ్వుకుని కొన్ని సంవత్సరాలు రైతులు జీవనం సాగించారన్నారు. అయితే కరువు తీవ్రమవడంతో బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోయిందన్నారు. దీంతో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్చెల్సీ, హెచఎనఎ్‌స వంటి నీటి కాలువలు అరకొరగానే వ్యవసాయానికి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒక సారి ప్రభుత్వాలు మారుతున్నా శాశ్వత పరిష్కారాలు మాత్రం చూపడంలేదని వాపోయారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించడంలేదన్నారు. నీటి వనరుల లభ్యతను గుర్తించడం, వరద నీటిని నిల్వ చేయడం, ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు నీటిని తరలించడం, ప్రస్తుతమున్న కాలువలను విస్తరింపచేయడం, అధిక టీఎంసీల నీటిని కేటాయించడం పరిష్కార మార్గాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వెంకటేష్‌, లక్ష్మి, విశ్వనాథ్‌, హరిత, చంద్రన్న, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:49 PM