nutrition Pakwad పోషణ పక్వాడ్‌పై అవగాహన
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:04 PM
మండలంలోని గుంజేపల్లి గ్రామంలో పోషణ పక్వాడ్‌పై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ముదిగుబ్బ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుంజేపల్లి గ్రామంలో పోషణ పక్వాడ్‌పై సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ చంద్రమ్మ, ఎర్రమ్మ, విజయమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తనకల్లు : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడీపీఓ జయంతి, తహసీల్దార్ శోభాసువర్ణమ్మ మాట్లాడుతూ.. చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో ఏపీఎం జయంతి, ఎంఈఓ కళ్యాణి, ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త, సూపర్‌వైజర్లు లక్ష్మీదేవమ్మ, జయమ్మ, కార్యదర్శులు పాల్గొన్నారు.
తాడిమర్రి : మండల పరిఽధిలోని నార్శింపల్లి గ్రామంలో సోమవారం అంగనవాడీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లలితమ్మ గర్భవతులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎనఎం క్రిష్ణవేణి, అంగనవాడీ కార్యకర్తలు, గర్భవతులు పాల్గొన్నారు.