Food Poison: ఆసుపత్రిలో చేరిన 150 విద్యార్థులు.. పలువురి పరిస్థితి ఆందోళనకరం
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:04 PM
యూనివర్సిటీ కళాశాలలో పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

అనంతపురం, ఆగస్ట్ 01: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలోని వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గురువారం రాత్రి ఆహారం కలుషితం కావడంతో.. దాదాపు 150 మందికిపైగా విద్యార్థులకు వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో యూనివర్సిటీ సిబ్బంది.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తుంది. అయితే యూనివర్సిటీలోని కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.
కానీ ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. అందులోభాగంగా ఆసుపత్రిలో వీడియోలు తీయడాన్ని అడ్డుకుంది. ఒక మరికొంత మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. వారిని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదీకాక యూనివర్సిటీలో తాగు నీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతోపాటు ఆహారం కలుషితం కావడం తమ అనారోగ్యానికి కారణమని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పరిస్థితి రావడానికి కళాశాల యాజమాన్యం కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనలో పలువురు ఆసుపత్రి నుంచి కొలుకుని ఇంటికి వెళ్లగా.. మరికొంత మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటన చోటు చేసుకోవడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్
గుడ్‌న్యూస్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన
For More AP News and Telugu News