Share News

పర్యటనల పేరిట ప్రాణాలు తీస్తున్నారు: అనగాని

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:09 AM

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలు చేపడుతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు.

పర్యటనల పేరిట ప్రాణాలు తీస్తున్నారు: అనగాని

తిరుపతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలు చేపడుతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ధ్వజమెత్తారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం పర్యటనల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. మామిడి రైతులకు అన్యాయం జరుగుతోందని జగన్‌ గగ్గోలు పెడుతున్నారని, అయితే గతంలో అయినా ఇప్పుడైనా రాష్ట్రంలో మామిడి రైతును ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని అన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 05:10 AM