Share News

Tourism Project: 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

ABN , Publish Date - Jun 24 , 2025 | 03:58 AM

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.

Tourism Project: 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

  • కేంద్రమంత్రి షెకావత్‌, పవన్‌, పురందేశ్వరి రాక

  • 2027 పుష్కరాల నాటికి పనులు పూర్తి

  • పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 26న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.94.44 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాలకు కొత్త సొబగులు, గోదావరి తొలి రైల్వే వంతెన హేవలాక్‌ బ్రిడ్జి పునర్నిర్మాణం, ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్‌ఘాట్‌ అభివృద్ధి, గోదావరికి నిత్యహారతి, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌గా కడియం నర్సరీలు, పర్యాటక కేంద్రంగా గోదావరి మధ్యలోని బ్రిడ్జిలంక, నిడదవోలులోని ప్రఖ్యాత కోట సత్తెమ్మ దేవాలయానికి సరికొత్త శోభ సమకూరనుందని చెప్పారు. ఇప్పటికే పుష్కరఘాట్‌ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని, ఇక్కడే మొదట సుందరీకరణ పనులు మొదలవుతాయని చెప్పారు. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని, ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8వేల మంది యువతకు ఉపాధి చేకూరుతుందన్నారు.


జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు

రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం సృష్టించడానికి మాజీ సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి వాటిని కూటమి ప్రభుత్వం అణచివేస్తుందని మంత్రి దుర్గేష్‌ అన్నారు. జగన్‌ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు తీర్మానం చేయాలని కోరారు.

Updated Date - Jun 24 , 2025 | 03:58 AM