Share News

Aditya Group: రోబోటిక్స్‌లో సత్తా చాటిన ఆదిత్య లక్ష్య విద్యార్థులు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:00 AM

రోబోరోర్జ్‌ మలేషియా 2025 వెఫా రోబోటిక్‌ పోటీల్లో కాకినాడ జిల్లాకు చెందిన లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 8, 9, 10 తరగతుల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు.

Aditya Group: రోబోటిక్స్‌లో సత్తా చాటిన ఆదిత్య లక్ష్య విద్యార్థులు

కాకినాడ రూరల్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రోబోరోర్జ్‌ మలేషియా 2025 వెఫా రోబోటిక్‌ పోటీల్లో కాకినాడ జిల్లాకు చెందిన లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 8, 9, 10 తరగతుల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు. ఈ పోటీలను ఈ ఏడాది ఆసియా పసిఫిక్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించగా ప్రాఽథమిక, మాధ్యమిక, సీనియర్‌ విభాగాల్లో సెకండరీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక జట్టు లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్టు అని డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సుగుణారెడ్డి తెలిపారు. సెకండరీలో మొత్తం 15 జట్లు పాల్గొన్నాయి. 8 జట్లు పోటీలకు ఎంపిక కాగా వాటిలో లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి రెండు జట్లు ప్రాతినిధ్యం వహించాయి.


స్మోర్ఫీ ఇమాజినరీ, స్మోర్ఫీ పైలట్‌, స్మోర్ఫీ స్క్వేర్‌ అటానమస్‌ వంటి మూడు సవాళ్లలో జట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. స్మోర్ఫీ ఇమాజినరీలో టీమ్‌ లక్ష్య-1 ప్రఽథమ, టీమ్‌ లక్ష్య-2 తృతీయ స్థానంలో నిలిచాయి. స్మోర్ఫీ పైలట్‌లో టీమ్‌ లక్ష్య-2 రజతం, టీమ్‌ లక్ష్య-1 కాంస్య పతకం పొందాయి. స్మోర్ఫీ స్క్వేర్‌ అటానమ్‌సలో టీమ్‌ లక్ష్య-2 స్వర్ణం, టీమ్‌ లక్ష్య-1 రజతం సాధించి మొత్తం ఈవెంట్లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్నాయి. లక్ష్య-1 జట్టులోని విద్యార్థులు రిహాన్‌సనా, లలిత్‌కుమార్‌వర్మ, జి.సాజిత్‌, ఎ.ఆనంద్‌, ఎ.వినీత్‌, లక్ష్య జట్టు-2 జట్టులోని విద్యార్థులు డి.మనోహరరెడ్డి, దుర్గాఆదిత్యశశాంక్‌, ముకుంద, నాగసాయిఅభినవ్‌, ఎన్‌.అర్జున్‌ను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి, డైరెక్టర్‌ సుగుణారెడ్డి అభినందించారు.

Updated Date - Jun 27 , 2025 | 04:01 AM