Share News

Project Cancellation: అదానీకి అనుమతులు రద్దు

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:56 AM

ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులకు దక్కాల్సిన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలను..

Project Cancellation: అదానీకి అనుమతులు రద్దు

  • గిరిజనులకు అన్యాయం చేస్తూ ఆనాడుఆంధ్రా, ఒడిసా సరిహద్దులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు

  • వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులకు దక్కాల్సిన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలను అదానీకి కట్టబెడుతూ మాజీ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మన్యం పార్వతీపురం జిల్లా కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలకు గతంలో ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ సోమవారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతంపై ఆంధ్రా-ఒడిసాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతంలో తమ రాష్ట్రానికి చెందిన గిరిజనులతో పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రాలను నిర్మింపజేస్తామని కేంద్రానికి 2018-24 మధ్య కాలంలో ఒడిసా ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆంధ్రా, ఒడిసా రాష్ట్రాల ఇంధన శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపింది. 2019లో జగన్‌ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 2022లో అదానీ సంస్థకు అనుమతులు ఇచ్చారు. కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో వీటి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గిరిజనుల హక్కులను కాలరాస్తూ జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఒడిసాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి.. అదానీకి ఇచ్చిన పీఎస్పీ అనుమతులు రద్దు చేయాలంటూ ఇంధన శాఖను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:56 AM