Share News

25 Year Old: షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:31 PM

25 Year Old: 25 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. షటిల్ ఆడుతూ ఉన్నట్టుండి నేలపై పడిపోయాడు. అక్కడికక్కడే షటిల్ కోర్టులోనే ప్రాణం విడిచాడు.

25 Year Old: షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..
25 Year Old

ఈ మధ్య కాలంలో గుండె పోటు మరణాలు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ గుండెపోట్లు బలి తీసుకుంటున్నాయి. ఆరోగ్యంగా ఉండి.. నవ్వుతూ, తుళ్లుతూ తిరిగే వారు కూడా ఉన్నట్టుండి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, 25 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. షటిల్ ఆడుతూ ఉన్నట్టుండి నేలపై పడిపోయాడు. అక్కడికక్కడే షటిల్ కోర్టులోనే ప్రాణం విడిచాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.


సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా, తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం నాగోల్ స్టేడియంలో మిత్రులతో కలిసి షటిల్ ఆడడానికి వెళ్లాడు. షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడ్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించాడని తెలిపారు.


చిత్తూరులో డాక్టర్

చిత్తూరులో చోటుచేసుకున్న మరో ఘటనలో 53 ఏళ్ల ఓ డాక్టర్ చనిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన డాక్టర్ నరేంద్రకు ఇటీవలే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి బదిలీ అయింది. రుయా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నడుచుకుంటూ వెళుతుండగా ప్రొఫెసర్‌కు హార్ట్ అటాక్ వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రుయా అత్యవసర వార్డులో సీపీఆర్ నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం సిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూశాడు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన ఎద్దు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని..

ఏఐతో పోయే జాబ్స్ ఏవో చెప్పిన చాట్‌జీపీటీ సృష్టికర్త.. మీరు ఈ లిస్టులో ఉన్నారా

Updated Date - Jul 28 , 2025 | 03:34 PM