Share News

OU JAC: అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ వార్నింగ్

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:54 PM

Allu Arjun: పుష్ప 2 చిత్రం హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమను బెదిరిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి జేఏసీ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

OU JAC: అల్లు అర్జున్‌కి ఓయూ జేఏసీ వార్నింగ్

హైదరాబాద్, డిసెంబర్ 29: పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన ఓయూ జేఏసీకి ఆదివారం బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ పోలీసులకు ఓయూ విద్యార్థి జేఏసీ ఫిర్యాదు చేసింది. హీరో నివాసంపై దాడి చేసినందుకు అల్లు అర్జున్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఓయూ విద్యార్థి జేఏసీ వెల్లడించింది. అలా చేయకుంటే.. చంపేస్తామని అల్లు అర్జున్ మనుషులు తమను బెదిరిస్తున్నారని ఓయూ విద్యార్థి జేఏసీ... తమ ఫిర్యాదులో స్పష్టం చేసింది.

అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తన అనుచరుల నుంచి తమకు పోన్ కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హీరో అల్లు అర్జున్‌దేనని ఈ సందర్భంగా ఓయూ జేఏసీ స్పష్టం చేసింది. అలాగే తమ సెల్ నెంబర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వైరల్ చేస్తున్నారని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఫోన్ కాల్స్ ఆగకుంటే.. వేలాది మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. తమకు బెదిరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో జేఏసీ పేర్కొంది.


డిసెంబర్ 5వ తేదీన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రిమియర్ షో.. సంధ్య థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని అభిమానులతో వీక్షించేందుకు అల్లు అర్జున్‌తోపాటు పలువురు సంధ్య థియేటర్‌కు చేరుకున్నారు. ఆ క్రమంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: ట్రాక్టర్ నడపడానికి లైసెన్స్ అవసరమా..?


అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని జైలుకు తరలించారు. అతడు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ తొక్కిసలాటలో రేవతి మృతికి హీరో అల్లు అర్జున్ కారణమంటూ ఓయు జేఏసీ నేతలు.. పలువురు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 75 మంది ఉగ్రవాదులు హతం

Also Read: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?

Also Read: వారికి విజయవాడ నగర సీపీ వార్నింగ్


ఆ క్రమంలో అల్లు అర్జున్ నివాసంపై దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ఓయూ జేఏసీ దాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఓయూ జేఏసీ నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ వారు పోలీసులను ఆశ్రయించారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 29 , 2024 | 06:54 PM