Hanmakonda: గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దంటూ రైతుల వినూత్న నిరసన..
ABN , Publish Date - Jan 17 , 2024 | 04:23 PM
గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway) ఆ రైతుల పాలిట శాపంగా మారింది. దాన్ని రద్దు చేయాలంటూ పోరాడుతున్న రైతన్నలు ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు.

హన్మకొండ: గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway) ఆ రైతుల పాలిట శాపంగా మారింది. దాన్ని రద్దు చేయాలంటూ పోరాడుతున్న రైతన్నలు ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ(Hanmakonda) జిల్లా మీదుగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వెళ్తోంది. ఈ హైవే భూసేకరణలో జిల్లాకు చెందిన చాలా మంది రైతుల పొలాలు పోతున్నాయి. దీంతో తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే పలు రకాలుగా నిరసనలు తెలిపిన రైతన్నలు బుధవారం పరకాల ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.
అక్కడ బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసనలు తెలిపారు. ప్రభుత్వం భూములు లాక్కుంటే తమ బతుకులు ఆగం అవుతాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇచ్చేది లేదని చెబుతున్నారు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.