టెస్టు వీరులు.. ‘క్యాచ్’లతో రికార్డులు పట్టారు
ABN, Publish Date - Oct 30 , 2024 | 04:26 PM
టెస్టు క్రికెట్లో చాలా మంది గొప్ప ఫీల్డర్లు ఉన్నారు. ఈ క్రికెటర్లు తమ దారిలోకి వచ్చిన బంతిని కట్టడి చేయకుండా నిద్రపోరు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డ్‌లోనూ రాణించారు. కెరీర్లోనే కొన్ని అద్భుతమైన క్యాచ్‌లను పట్టుకుని రికార్డులకెక్కారు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 10 ఆటగాళ్ల జాబితా ఇది..

భారత మాజీ లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ది పెద్ద రికార్డే. కేవలం 164 మ్యాచ్‌ల్లో 210 క్యాచ్‌లతో టెస్టు క్రికెట్లో పేరు నిలుపుకున్నాడు.

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్ 166 మ్యాచ్‌ల్లో 200 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టు మ్యాచ్‌ల్లో 175 క్యాచ్‌లు పట్టాడు.

శ్రీలంక మాజీ దిగ్గజం మహేల జయవర్ధనే 149 మ్యాచ్‌ల్లో 205 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఇప్పటివరకు 149 మ్యాచుల్లో 205 క్యాచ్‌లు పట్టాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 168 మ్యాచ్‌ల్లో 196 క్యాచ్‌లు పట్టాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు 109 మ్యాచుల్లో 183 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా 128 మ్యాచ్‌ల్లో 181 క్యాచ్‌లు అందుకున్నాడు.
Updated at - Oct 30 , 2024 | 05:00 PM