NATS: చికాగోలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
ABN, Publish Date - Sep 13 , 2024 | 01:40 PM
చికాగో: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఎస్.ఆర్.కే టీమ్ ఈ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఇందులో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు. నాట్స్ చికాగో విభాగం క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, టోర్నమెంట్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి మంచి ప్రశంసలు లభించాయి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ క్రికెట్ టోర్నమెంట్...

చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆటగాళ్లు..

చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రియెట్ టోర్నమెంట్... కప్పు గెలుచుకున్న సంతోషంలో విజేతలు..

చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విన్ అయిన ఎస్ఆర్కే టీమ్..

క్రీడా స్ఫూర్తితో చికాగోలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.

చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది.

చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీమ్
Updated at - Sep 13 , 2024 | 01:40 PM