TTD: 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:29 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

తిరుమల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 10 నుంచి 19వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు జరుగనున్న నేపథ్యంలో 7వ తేది ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక, ఈ కార్యక్రమం నేపథ్యంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 6వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలు తీసుకోరు.