Weekly Horoscope : ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందంటే
ABN , First Publish Date - 2023-10-15T10:02:57+05:30 IST
ఈ వారం మీ రాశి ఫలాలు, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..

ఈ వారం మీ రాశి ఫలాలు, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం:
ప్రముఖులతో పరిచయాలేర్ప డతాయి. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శనివారం నాడు ఆత్మీయుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దైవదర్శనాలు, ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు:
మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు:
ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. బుధవారం నాడు పనులు సాగవు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి.పనులు చురుకుగా సాగుతాయి. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. గురువారం నాడు నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం:
గ్రహాల సంచారం బాగుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లిం పులు జరుపుతారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. శుక్రవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మక స్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు:
రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అవసరాలు వాయిదా వేసు కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడ తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకు లతో జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీటికి మాటికి అసహనం చెందు తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచు కోండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సోమవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పుణ్యక్షేత్రాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సా హపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. కీలక పత్రాలు అందుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం:
అవకాశాలను చేజిక్కించు కుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడ తాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించు కుంటారు. పెట్టుబడులు కలిసిరావు. గురు, శుక్రవారాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి.యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు:
ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ మనోబలమే శ్రీరామరక్ష. పట్టుదలతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఖర్చులు అధికం. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు హడావుడిగా సాగుతాయి. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు:
ఈ వారం అనుకూలదాయకం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దైవకార్యా లకు వ్యయం చేస్తారు. ఇతరులను మీ విష యాలకు దూరంగా ఉంచండి. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించ వద్దు. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి:
కార్యసిద్థికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శనివారం నాడు పనులు సాగవు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూ లించవు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.