Konda Couple: కొండా కపుల్.. ఈ లీడర్‌తో అయిన చివరి వరకు ఉంటారా...?
ABN , First Publish Date - 2023-02-09T20:16:05+05:30 IST
కొండా దంపతులు (Konda Couple). కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress).. వరంగల్ రాజకీయాల్లో (Warangala Politics) ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా..

కొండా దంపతులు (Konda Couple). కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress).. వరంగల్ రాజకీయాల్లో (Warangala Politics) ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వారి మాటకు తిరుగుండేది కాదు. ఆ తర్వాత కూడా పొలిటికల్ గా వారి బలాన్ని నిరూపించుకుంటూ వచ్చారు. కేసీఆర్ ను (KCR) తిట్టిన పార్టీలోనే చేరి కొత్త నియోజకవర్గంలోనూ గెలిచి వచ్చారు. కానీ 2018 తర్వాత సీన్ మారింది. అప్పటి టీఆర్ఎస్ ను (TRS) వీడి కాంగ్రెస్ లో (Congress) చేరారు. పోటీ చేసినా ఓడిపోయారు. అడపాదడపా తప్ప రాజకీయంగా పెద్దగా హాడావిడి లేకపోయినా ఈసారి పరకాల (Parakala) లేదా వరంగల్ ఈస్ట్ (Warangal East) నియోజకవర్గాల్లో తమ సత్తా చాటాలన్న కసితో అయితో ఉన్నారన్నది లోకల్ గా ఓపెన్ సీక్రెట్. కానీ, కొండా కపుల్స్ ఎన్నిసార్లు ఖండించినా వారు పార్టీ మారుతున్నారన్న ప్రచారం మాత్రం ఆగటం లేదు.
ఇక రీసెంట్ గా కాంగ్రెస్ లో కల్లోలం రేపిన పీసీసీ పదవుల విషయంలోనూ కొండా సురేఖ అసంతృప్తిరాగం ఎత్తటంలో ముందున్నారు. నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసే తన అసమ్మత్తిని తెలియజేశారు. దీంతో రేవంత్ రెడ్డితో కూడా కొండా కపుల్స్ కు గ్యాప్ పెరిగిందా? అన్న చర్చ పార్టీలో ఊపందుకుంది. కానీ, కొద్దిరోజులుగా పరిస్థితుల్లో మార్పులు కనపడుతున్నాయి. వరంగల్ జిల్లాలో మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో కొండా కపుల్స్- రేవంత్ రెడ్డి వైపు నిలబడుతున్నారని, అందుకే రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రలో కొండా మురళి.. రేవంత్ రెడ్డితో నడిచారని, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో కొండా కపుల్స్ ఆయన వైపు మొగ్గుచూపి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
కొండా కపుల్స్ వరంగల్ ఈస్ట్, పరకాల సీట్లను అడుతుండటంతో ఇక్కడ వీళ్లకు ఓకే చెప్పారా..? అని వరంగల్ లో చర్చ నడుస్తోంది. అయితే, వారికి ఎలాంటి హామీ ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండా కపుల్స్ మరోసారి యాక్టివ్ అవుతూ రేవంత్ రెడ్డితో నడుస్తున్నప్పటికీ, ఈయనతో అయినా ఎన్నికల వరకు సయోధ్యతోనే కొనసాగుతారా... ఇది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోతుందో చూడాలి.