Apple AirPods : యాపిల్‌కు కొత్త పేటెంట్‌

ABN , First Publish Date - 2023-04-15T03:23:30+05:30 IST

ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌ సరికొత్త పేటెంట్‌ పొందింది. వినికిడికి సంబంధించి అందులో లీనమయ్యేందుకు వీలుకల్పించే టెక్నాలజీకి ‘ద యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌మార్క్‌

Apple AirPods : యాపిల్‌కు కొత్త పేటెంట్‌

ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌ సరికొత్త పేటెంట్‌ పొందింది. వినికిడికి సంబంధించి అందులో లీనమయ్యేందుకు వీలుకల్పించే టెక్నాలజీకి ‘ద యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌మార్క్‌ అండ్‌ పేటెంట్‌ ఆఫీ్‌స(యూఎ్‌సపీటీఓ)’ నుంచి పేటెంట్‌ లభించింది. యాపిల్‌ నుంచి ఇకపై రాబోయే ఎయిర్‌పాడ్స్‌కు ఈ టెక్నాలజీని సమకూర్చనున్నారు. ‘మెజర్‌మెంట్‌ ఆఫ్‌ వర్చ్యువల్‌ లిజినింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ పేరిట ఈ పేటెంట్‌ యాపిల్‌కు లభించింది. ఇమ్మర్సివ్‌(లీనమయ్యే) ఆడియో విషయంలో యూజర్లలో వేర్వేరు అర్ధాలు ఉన్నాయి. దానికి అర్థం ట్రూ నాయిస్‌ కాన్సిలేషన్‌ అని కొందరు అభిప్రాయపడతారు. మరికొందరికి అది త్రీ డైమన్షనల్‌ స్టేజ్‌. వేర్వేరు పరిస్థితులను అనుసరించి ఇకపై ఎయిర్‌పాడ్స్‌ యూనిక్‌ అనుభవాన్ని కలిగిస్తాయి. కారులోపల, క్లాస్‌ రూమ్‌లో, గడ్డిపై నడిచేటప్పుడు... ఇలా వేర్వేరు పరిస్థితులకు అనుగుణంగా వినికిడికి సంబంధించిన అనుభూతి ఉంటుంది. ఈ సాంకేతికతతో ఒక సిరీ్‌సగా మైక్రోఫోన్లు, సెన్సర్లను విడుదల చేసే యత్నంలో యాపిల్‌ ఉన్నట్టు సమాచారం. ఈ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు చుట్టూ ఉన్న పరిస్థితులను స్కాన్‌ చేసి వైవిధ్యభరితమైన వినికిడి సౌలభ్యాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.

Updated Date - 2023-04-15T03:23:30+05:30 IST