Home » Parliament Budget Session
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
పార్లమెంట్ తొలి రోజు సమావేశాలు గందరగోళంగా ప్రారంభమయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.
పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందా? లేక వీగిపోతుందా? సభలో అధికార, విపక్ష పార్టీల బలాబలాలెలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం...
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
లోక్‌సభలో విపక్ష సభ్యుల మధ్య నినాదాలు కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని సబ్‌మిట్ చేశాయి. 125కి పైగా సంతకాలు సేకరించారని కాంగ్రెస్ MP మనీష్ తివారీ తెలిపారు. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ, ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే TMC మాత్రం మద్దతు ఇవ్వడం లేదు.
పార్లమెంట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా.. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తిరస్కరించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఎకనమిక్ సర్వే-2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2026-27లో భారత జీడీపీ 6.8 నుంచి 7.2 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనావేసే ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమమే కేంద్రంగా తమ నిర్ణయాలు, పథకాలు ఉంటాయని అన్నారు.