Home » Mylavaram
మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.
నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలకు పాఠశాలలో వంట ఏజెన్సీ సంస్థ నాసిరకం భోజనం వడ్డించింది. దీంతో ఆగ్రహించిన బాలలు.. ఆ భోజనాన్ని డస్ట్ బిన్‌లో పడేశారు.
Fridge explosion: కృష్ణా జిల్లాలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున భారీ శబ్ధం వచ్చింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. తీరా ఏం పేలిందో తెలుసుకుని షాక్ గురయ్యారు.
Andhrapradesh: భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడింది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కలింగం వద్ద చెరువుకు గండి పెట్టి నీరును దిగువకు వదిలి అనంతరం చెరువుకు పడిన గండిని నేతలు పూడుస్తున్నారు. ఎర్ర చెరువు నీటిని దిగువకు విడుదల చేయడంతో జి.కొండూరు మండలం గుర్రాజుపాలెం గ్రామానికి వరద ముప్పు పొంచివుంది.
Andhrapradesh: వర్షాలు ఏపీని వీడటం లేదు. భారీ వర్షాలకు బుడమేరు మహోగ్రరూపం దాల్చడంతో బెజవాడ ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే వరద భారీ నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్న పరిస్థితి. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో డ్రైన్‌లు పొంగి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు నీరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్‌రెడ్డి తెలిపారు.
మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు.
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్‌ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల పోలింగ్ అనేక ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలింగ్ మొదలవక ముందు నుంచే వైసీపీ నేతల దౌర్జన్యాలు బయటబడ్డాయి. టీడీపీ నేతలపై దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు.