Home » Moinabad farm house
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్‌కి వివరణ ఇచ్చామని చెప్పారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అజీజ్ నగర్‌లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, అలాగే కాల్పుల ఆరోపణలు వంటి అంశాలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలోని ఎస్‌కే రీట్రీట్ ఫాంహౌ్‌సలో అనుమతులు లేకుండా జరుగుతున్న పార్టీపై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేశారు.