Home » Mexico City
మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న 'ఎల్ మెంచో' ఎట్టకేలకు హతమయ్యాడు. అతడ్ని పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఒక ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది.
మెక్సికోలో భారీ భూ ప్రకంపనలతో ప్రజలు గజ గజ వణికిపోయారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా వేలాది మంది మెక్సికో యువకులు రోడ్ల మీదకు వచ్చి చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నించారు.
'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..
ప్రపంచంలో బర్డ్ ఫ్లూ(Bird Flu) తొలి మరణం మెక్సికోలో(Mexico) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్‌లో తీవ్రమైన జ్వరం, శ్వాస ఆడకపోవడం, అతిసారం, వికారం తదితర జబ్బులతో బాధపడుతూ మెక్సికోలోని ఓ ఆసుపత్రిలో చేరాడు.
మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటివని భావిస్తున్న రెండు ఏలియన్స్ అవశేషాలపై లోతైన చర్చ నడుస్తోంది. సైంటిస్టులు కూడా వాటిపై ఇన్ డెప్త్ రిసర్చ్ చేయడానికి ముందుకు వచ్చారు. దేశ విదేశాల నుంచి సైంటిస్టులు ఇప్పటికే మెక్సికోకు చేరుకున్నారు.
ఏలియన్స్ మనుగడపై అనేక పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులకు ఓ తీపి వార్త అందింది. మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటి రెండు ఏలియన్ అవశేషాలు లభించాయి.
మెక్సికో సిటీలో (Mexico City) అత్యంత దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం ఓ భారత సంతతి వ్యక్తిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపారు.