Home » Iran President Helicopter Crash
ఇజ్రాయెల్ ప్రధాని గురించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణవార్త కేవలం ఒక పుకారు మాత్రమేనని పేర్కొంది. ఇవి.. దేశంలో అలజడి సృష్టించేందుకు శత్రువుల తప్పుడు ప్రచారమని వ్యాఖ్యానించింది.
ఒకవైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే.. అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో తన సైనికశక్తిని విపరీతంగా పెంచుతోంది. గత 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్‌లను ఈ ప్రాంతానికి తరలించినట్లు అధికారిక వర్గాలు, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా తెలుస్తోంది.
చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తుల ఫలితం.. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్ అగ్నిగుండంలా మారిపోతోంది. ఇరాన్ ప్రజలు ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
ఇరాన్‌లో పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ మంత్రి కాల్ చేశారు. అక్కడి తాజా పరిస్థితుల గురించి వివరించారు.
అమెరికా బీ-52 భారీ యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు తరలించింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా తరలించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.
‘‘తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపుచెక్కతో నే రెండిస్తా’’.. అనే సామెత చందంగా అక్టోబరు 1న ఇరాన్ తమ దేశంపై క్షిపణుల వర్షానికి ప్రతిగా ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్లతో వెళ్లి తీవ్ర ప్రతిదాడి చేసి విధ్వంసం సృష్టించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు!
ఇరాన్‌లోని టెహ్రాన్, ఇలాం, కుజెస్థాన్‌లో ఉన్న సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్ తయారీ, ప్రయోగ కేంద్రాలపై శనివారం తెల్లవారుజామున చేసిన దాడిలో లక్ష్యాలన్నీ పూర్తి చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.
ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బలూచ్ ప్రావిన్స్‌లో పోలీసుల కాన్వాయ్‌పై శనివారం జరిగిన దాడిలో 10 మంది అధికారులు మృతి చెందారు.
ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.