Home » Gas price Hike
వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్‌పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై 60 రూపాయలు పెంచాయి.
ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.
అమెరికా - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం హైదరాబాద్ నగరంలోని చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తోంది. యుద్ధం సేపథ్యంలో ఇక్కడి వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడడంతో చిన్న, మధ్యతరహా హోటళ్ల వ్యాపారం కుదేలవుతోందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి చెబుతున్నారు.
ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ గ్రేటర్‌లో భారీగా పెరిగింది. గ్యాస్ కొరత, బుక్ చేసినా సిలిండర్ ఆలస్యంగా రావడం వంటి కారణాలతో నగరవాసులు ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో వాటి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. విక్రయాలు పెరగడంతో హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధరలు 20-30 శాతం పెరిగాయి.
ఎల్‌పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.