Home » Delhi Excise Policy
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్‌పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే స్వాగతించారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైనందున కోర్టు తీర్పును గౌరవించాలని అన్నారు.
Delhi Election 2025 Results Live Updates in Telugu News: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు లెక్కలు మారుతున్నాయి. తొలుత వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త లీడ్‌లోకి వచ్చారు. ప్రస్తుతానికి బీజేపీ లీడ్‌లో ఉండగా.. చివరి వరకు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ మళ్లీ సత్తా చాటి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోందా? లేకుంటే అధికార పీఠాన్ని మరో పార్టీ హస్త గతం చేసుకోంటుందా?
బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
న్యూఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించుకొనేందుకు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం అక్టోబర్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో జనతా కా అదాలత్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న జంతర్ మంతర్ వద్ద ఆయన నిర్వహించిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.