Home » Botsa Satyanarayana
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసనమండలిలో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందజేశారు.
పూర్తి ఆరోగ్యంతో శాసనమండలికి వచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
పెట్టుబడిదారుల్లో వైసీపీ నాయకులు భయాందోళనలు పుట్టిస్తున్నారని పల్లా శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌పరం కావని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే 7,300 కోట్ల రూపాయలు కావాలన్నారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.
కూటమి మోసపూరితమైన మాటలు నమ్మి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగులను , ప్రజలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు.
గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని టీడీపీ సభ్యుడు మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.
యూరియా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలు చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడకూ ప్రభుత్వం పారిపోవడం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
50 ఏళ్లకే ఫించన్ అన్నారని.. అదే అడిగితే దానికి సమాధానం లేదని బొత్స అన్నారు. ప్రశ్న అడిగితే ఏవేవో సమాధానాలు చెప్తున్నారని మండిపడ్డారు.